జైరాం రమేష్ చెయ్యి చూసి జాతకం చెప్పిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్!

  • హోదాను డిమాండ్ చేస్తూ శివప్రసాద్ వినూత్న వేషధారణ
  • నేడు కోయదొర వేషంలో పార్లమెంట్ కు
  • జైరాం రమేష్ చెయ్యి చూసి పరిస్థితి బాగా లేదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న నిరసనల్లో భాగంగా నిత్యమూ తనదైన వేషధారణలో పార్లమెంట్ కు వస్తున్న చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, నేడు ఓ కోయదొర వేషంలో వినూత్నంగా కనిపించారు. పార్లమెంట్ ఆవరణలో అటూఇటూ తిరుగుతున్న ఆయనకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కనిపించగా, ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని చేతి రేఖల గురించి వివరిస్తూ జాతకం చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదని ఈ చెయ్యిని చూస్తే తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. గతంలో ఈ చెయ్యి ఎంతో అధికారాన్ని చూసిందని ఈ రేఖను చూస్తే కనిపిస్తోందని, ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితిలో ఉన్నావని జోకులు వేశారు. వీరిద్దరిని, వారి మధ్య సంభాషణను పక్కనే ఉన్న ఎంపీలు, మీడియా వారు ఆసక్తిగా తిలకించారు.
Go Back to Shorts
Jairam Ramesh
Siva Prasad
Parliament

More Telugu News